హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20న జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు

W.G: జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు ఈనెల 20న తణుకులో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. అండర్-14, 16, 18,20 విభాగాల్లో బాలురు, బాలికలు పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేసి, అనంతరం ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు హాజరవుతారన్నారు.