హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో బ్యాంకు ఉద్యోగాలకు క్యాంపస్ డ్రైవ్

కడప కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 21న ICICI బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగాల కోసం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సహకారంతో ఈ ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్మిత తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు హాజరుకావచ్చన్నారు.