హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు

HYD: నగరంలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. HYDలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, IT కారిడార్‌తో పాటు చారిత్రక ప్రాంతాలను ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించేలా ఆ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పర్యావరణ మిత్రగా ఉండేలా 2 విద్యుత్ బస్సులను మొదటి దశలో ప్రవేశపెట్టనున్నారు. త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని TGTDC ఉన్నతాధికారి తెలిపారు.