HNK: ఆర్టీసీ బకాయిలు చెల్లించాలని కోరుతూ విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు ఐకాస నాయకులు లక్ష్మయ్య, మనోహర్, వెంకన్న, రవీందర్ తెలిపారు. గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో సుమారు 300 మంది విశ్రాంత ఉద్యోగులు సమావేశమయ్యారు. బకాయిల చెల్లింపుపై చర్చించారు. తమ సమస్యల పరిష్కారానికి న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ బకాయిలు చెల్లించాలని డిమాండ్


