హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీఎంఏవై దరఖాస్తులకు 24 వరకు అవకాశం'

కృష్ణా: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 24 వరకు పొడిగించినట్లు గుడ్లవల్లేరు ఎంపీడీవో ఇమ్రాన్‌ తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సంబంధిత వివరాలతో సమీప గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.