హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు ఇళ్లలో భారీ చోరీ

SDPT: మిరుదొడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలో గురువారం పగటిపూట రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. పొలం పనులకు వెళ్లిన లకిడి ప్రకాష్, వజ్జపల్లి నర్సింగరావు ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగలు పడ్డారు. ప్రకాష్ ఇంట్లో 4.5 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.6 వేలు; నర్సింగరావు ఇంట్లో తులం బంగారం, 20 తులాల వెండి అపహరించారు. ఎస్సై సతీష్ క్లూస్ టీంతో పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.