హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగ్గురు అటవీ సిబ్బంది సస్పెన్షన్

MHBD: అక్రమ టేకు దుంగల సీజ్, తరలింపు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొత్తగూడ మండల ఎఫ్‌ఆర్‌వో వంశీకృష్ణ, ఎఫ్‌ఎస్‌వో బాలాజీ, బీట్ అధికారి కృష్ణవేణిలను భద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్ భీమానాయక్ గురువారం సస్పెండ్ చేశారు. జులై 9న సీజ్ చేసిన టేకు దుంగల్లో కొన్ని మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో ఈ చర్యలు తీసుకున్నారు.