హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేయాలి’

NLG: రైతులు పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేసుకోవాలని చండూరు ఏవో పి. మల్లేష్ అన్నారు. చండూరు మండ‌లం బోడంగిపర్తి గ్రామ పంచాయతీ పరిధి కుమ్మందానిగూడెంలో గురువారం పత్తి పంట సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆత్మ సౌజన్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. పత్తి పంట విత్తనం వేసుకునే మొదలు పత్తి తీసే వరకు రైతులు చేపట్టాల్సిన సాగు పద్ధతులను AO వివరించారు.