హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాల వద్ద పోలీసుల పర్యవేక్షణ

SRPT: కోదాడ పట్టణంలోని గణేష్ మండపాల వద్ద గురువారం రాత్రి పట్టణ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉత్సవ నిర్వాహకులకు భద్రతా పరంగా పలు సూచనలు చేశారు. నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.