హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి'

కోనసీమ: రెవెన్యూ సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని రాజోలు MLA దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం మలికిపురం మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. గ్రామాల్లో అర్హులైన వారికి నిరభ్యంతర భూముల పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించాలని సూచించారు.