హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో కాంగ్రెస్ నాయకుడు మృతి

KMM: తల్లాడ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గువ్వల రామిరెడ్డి అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు కాంగ్రెస్‌ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామిరెడ్డి మృతి పార్టీకి, కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.