హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ

KNR: గంగాధర (M)రైతు వేదికలో ఉద్యాన శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో గురువారం రైతులకు శిక్షణ నిర్వహించారు. పంట మార్పిడి, కూరగాయల సాగు, ఆయిల్‌పామ్‌ పంటలపై నిపుణులు అవగాహన కల్పించారు. కేవీకే జమ్మికుంట ఉద్యాన శాస్త్రవేత్త వేణుగోపాల్‌ కూరగాయల్లో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ ప్రియదర్శిని, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.