కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో డ్రైనేజీ మురుగు పంట పొలాల్లోకి చేరుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు పొలాల్లోకి చేరడంతో పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, మురుగు పంట పొలాల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మురుగు నీటితో పంటలకు ముప్పు


