హైదరాబాద్: 28°C
తెలంగాణ

56 రకాల పిండివంటల సమర్పణ

SRD: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి విద్యానగర్ వినాయక మండపంలో గురువారం రాత్రి గణపతికి 56 రకాల నైవేద్యాలను నివేదించారు. ఓ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. కాలనీలోని మహిళలు భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన వివిధ పదార్థాలను వినాయకునికి సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.