హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వివేకానందుడి స్ఫూర్తి యువతలో ఉండాలి'

MBNR: పట్టన కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానందుడి స్ఫూర్తిని యువత అలవర్చుకుని సేవాభావంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.