హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు పూర్తి చేయాలి'

ASR: కొయ్యూరు మండలం ఉసిరికపాడులో రూ.1.63‌కోట్లతో నిర్మించిన గ్రావెల్ రోడ్డు అసంపూర్తిగా వదిలేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఫార్మేషన్ మాత్రమే చేసి బూడిద, కల్వర్టులు, డ్రైనేజీ పనులు చేయలేదన్నారు. వర్షాలకు రోడ్డు గుంతలమయమై రాళ్లు తేలడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గర్భిణులు, బాలింతలు, రోగులను ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు పడుతున్నామన్నారు.