ASR: కొయ్యూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏడాదిగా ఖాళీగా ఉన్న ప్రత్యేకాధికారి (ఎస్వో) పోస్టు భర్తీ అయింది. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న శోభా లావణ్యను ఎస్వోగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు, ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థినుల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొయ్యూరు కేజీబీవీలో ఎస్వో నియామకం


