MDK: మెదక్ 765 జీజే జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న అక్కన్నపేట రైతులకు నష్టపరిహారం పెంచేందుకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని ఆర్డీవో రమాదేవి తెలిపారు. పరిహారంపై కోర్టుకు వెళ్లిన 16 మంది రైతులతో గురువారం ఆమె చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో తహశీల్దార్ రజనీకుమారి పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులు ఆందోళన చెందవద్దు: ఆర్డీవో


