హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పాడి పశువులకు ఉచిత చికిత్స

MDK: అక్కన్నపేట హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పశువుల స్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శిబిరంలో పశువులకు గర్భకోశ సమస్యల నిర్ధారణతో పాటు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ పాడి రైతులందరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.