హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్: నేడు భారత్ vs జపాన్

ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సిద్ధమైంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు జరిగే క్వార్టర్ ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌తో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. షెఫాలి వర్మ, స్మృతి మంధానా మంచి ఫామ్‌లో ఉండగా.. గాయాల నుంచి కోలుకున్న రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్ జట్టులోకి రావడం భారత్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది.