ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 60 పరుగులు చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 34వ బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. భారత్ తరఫున కోహ్లి, రోహిత్, శిఖర్ ధవన్, సూర్యకుమార్ తర్వాత ఈ రికార్డు సాధించిన ఐదో ఆటగాడిగా సంజూ నిలిచాడు.
క్రీడలు
9000 పరుగుల క్లబ్‌లో సంజూ


