హైదరాబాద్: 28°C
క్రీడలు

నేలపైనే నిద్రించిన థాయ్ అథ్లెట్లు

ఆసియా గేమ్స్ కోసం జపాన్‌లోని నగోయాకు చేరుకున్న క్రీడాకారులు తీవ్ర వసతి సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రూయిజ్ షిప్‌లలో చిన్న గదుల్లో ముగ్గురు చొప్పున అథ్లెట్లను ఉంచడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. థాయ్‌లాండ్ అథ్లెట్లు గదులు దొరకక నేలపైనే నిద్రించారు. భారత షూటర్లకు వేదికకు 50 కి.మీ దూరంలో హోటల్ కేటాయించడంతో రోజూ రెండు గంటలు ప్రయాణించాల్సి వస్తోంది.