హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిని అగ్రస్థానంలో నిలుపుతాం: మంత్రి

SRD: సంగారెడ్డి మెడికల్ కళాశాలను వైద్య విద్య, సేవల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. కాలేజీలో హెటిరో ఫౌండేషన్ నిర్మించిన క్రీడా మైదానాలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. టీబీ బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. వైద్యులు గ్రామీణ సేవలకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి సూచించారు.