హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

NZB: నగరంలోని గ్లామర్ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వృద్ధుడిని RTC బస్సు ఢీ కొట్టగా అతడు మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదని గుర్తింపు కోసం దర్యాప్తు జరుగుతోందని NZBవన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుడి వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.