WGL: భద్రకాళి దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. హుండీల ద్వారా రూ.72,30,387 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 628 US డాలర్లు, 5 కెనడా డాలర్లు, 110 UAE దిరమ్స్, 10 పౌండ్లు, 10 యూరోలు తదితర విదేశీ కరెన్సీ లభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రామల సునీత, ప్రధానార్చకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారి ఆలయంలో హుండీల లెక్కింపు


