ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు షాకిచ్చింది. చిన్నారుల ప్రయాణ ఛార్జీని రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచింది. అలాగే అదనపు లగేజీకి కిలోకు రూ.100 పెంచి రూ.800 చేసింది. ఒంటరిగా ప్రయాణించే మైనర్ల సేవా రుసుమును రూ.5,999కి సవరించింది. పెరిగిన ఈ ఛార్జీలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఇండిగో ప్రకటించడంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది.
వ్యాపారం
ప్రయాణికులకు ఇండిగో షాక్.. ఛార్జీలు పెంపు


