హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో వైభవంగా గణేశుడి ఊరేగింపు

TPT: నాయుడుపేట పట్టణంలోని పోలేరమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన గణనాథుని ఊరేగింపు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా గణనాధుడిని ప్రత్యేక పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.