హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగం పేరుతో రూ.లక్ష మోసం

WGL: పర్వతగిరి మండలం మొండ్రాయికి చెందిన కన్నెబోయిన రాజుకు పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడకు చెందిన మాచర్ల ఆనంద్ సాగర్ రూ. లక్ష తీసుకుని మోసం చేసినట్లు సీఐ సంతోశ్ తెలిపారు. ఉద్యోగం కల్పించకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడలో నిందితుడిని అరెస్ట్ చేసి,రిమాండ్‌కు తరలించారు.