హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాట్య గణపతి అలంకారంలో వినాయకుడు

కోనసీమ: అయినవిల్లి క్షేత్రంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగో రోజైన గురువారం స్వామివారు నాట్య గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాల నడుమ నిర్వహించిన తిరువీధి సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.