హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి

కోనసీమ: ఆత్రేయపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న యార్లగడ్డ సత్యానందంపై తేనెటీగలు దాడి చేయడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఇంటికి పంపించగా మృతి చెందినట్లు ఎంపీడీవో పి.వి.ఆర్.కె. రాజు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాన్ని పరామర్శించారు.