హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పేకాటరాయుళ్లు అరెస్ట్..!

KDP: వీఎన్. పల్లి మండలం గోనుమాకులపల్లి సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య గురువారం తెలిపారు. సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 9,300 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.