హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శరవేగంగా సీసీ రోడ్డు పనులు

ప్రకాశం: నిత్యం రద్దీగా ఉండే కనిగిరి RTC డిపో నుంచి ABR ఇంజినీరింగ్ కాలేజీ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా గుంతలమయంగా మారిన ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.4.80 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు.