హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వెలుగు చూసిన వివక్ష ఘటన

KMR: బిచ్కుంద(M) గుండెనెమలి అంగన్‌వాడీ కేంద్రంలో కుల వివక్ష వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ మహిళ సీడీపీఓకు తెలిపిన వివరాల ప్రకారం..ఎస్సీ కాలనీకి చెందిన చిన్నారిని అంగన్వాడీ టీచర్ సరైన విధంగా చూడటం లేదని, కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటన పై విచారణ జరిపి బాధ్యులుపై చర్యలు తీసుకోవాలని మహిళ సీడీపీఓను కోరింది.