హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో గురువారం ఆటో ప్రమాదం చోటు చేసుకుంది. పాలజ్ నుంచి కుబీర్ వైపు వస్తున్న ఆటో పల్సి గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణారెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.