హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమిష్టిగా ఉండి హక్కులను సాధించుకోవాలి'

ADB: సమిష్టిగా ఉండి హక్కులను సాధించుకోవాలని మాల JAC ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు సత్యనారాయణ అన్నారు. గురువారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. SC వర్గీకరణ అనంతరం రోస్టర్ విధానంతో మాల జాతికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించి 20 లోపు రెండు స్థానాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.