హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెంగాళమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు

TPT: సూళ్లూరుపేటలో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ అభివృద్ధి కమిటీ ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రహరీ గోడ, ప్రసాదాల తయారీ గదులు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ అభివృద్ధికి కమిటీ ప్రాధాన్యత ఇస్తుందని, అన్నదానానికి సభ్యులు రూ.4.50 లక్షలు విరాళంగా అందించినట్లు పేర్కొన్నారు.