హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశీస్సుల దీపం వెలిగించిన ఎంపీ

HYD: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఎంపీ డీకే అరుణ ఆశీస్సుల దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రధాని మోదీకి ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని పేర్కొన్నారు.