హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరం పై దాడి పది మందిపై కేసు నమోదు

KMM: వేంసూరు మండలం బీమవరం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని 52 పేకముక్కలు, రూ.29,600 నగదు, మోటార్‌సైకిల్‌, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు పరారైనట్లు ఎస్సై తెలిపారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పేకాటపై కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.