హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటుగాళ్ల అరెస్ట్.. 10.3తులాల గోల్డ్ స్వాధీనం

ASF: రెబ్బెన మండలం ఖైర్గావ్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నలుగురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10.3 తులాల బంగారం, 30 తులాల వెండి, 4 మొబైల్ ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, చోరీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.