హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటరు దరఖాస్తులు తిరస్కరించవద్దు: కలెక్టర్

ప్రకాశం: సహేతుకమైన కారణాలు లేకుండా ఓటరు దరఖాస్తులు, అభ్యంతరాలను తిరస్కరించవద్దని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఓటర్లు సమర్పించే ఫొటోల నాణ్యతను పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సీఈవో వివేక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.