హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల

NLG: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో నూతన ఓటర్ల నమోదుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈరోజు షెడ్యూల్ విడుదల చేశారు. పాత జాబితాలతో ప్రమేయం లేకుండా, గతంలో ఓటు ఉన్నవారు కూడా తప్పనిసరిగా సవరించిన ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.