హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయ వ్యాధి నిర్మూలనకు ఏఐ సాంకేతికత

MLG: ఏటూరునాగారం మండలంలోని అకలవారి గణపురం–3 ఉపకేంద్రంలో ఎన్‌టీఈపీ ఆధ్వర్యంలో ఉచిత ఏఐ ఆధారిత ఛెస్ట్ ఎక్స్‌రే స్క్రీనింగ్ నిర్వహించారు. 80 మందికి పరీక్షలు చేయగా ముగ్గురు క్షయ అనుమానితులను గుర్తించి తదుపరి పరీక్షల కోసం ములుగు జిల్లా కేంద్రానికి రిఫర్ చేశారు. లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.