MHBD: జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో చిత్తడి నేలల పరిరక్షణ, అభివృద్ధి,అంశాలపై సమగ్రంగా చర్చించారు. చిత్తడి నేలల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వాటి పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
చిత్తడి నేలల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష


