హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెప్టెంబర్ 30లోపు పంట నమోదు పూర్తి చేయాలి'

PDPL: జిల్లాలో డిజిటల్ పంట సర్వే సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. గురువారం ఆయన ఐడిఓసిలో మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి, మండలాల వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతు సాగు చేస్తున్న పంట వివరాలు క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. ఏ ఒక్క రైతు బోనస్ నష్టపోకుండా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.