హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్‌ మండపాల వద్ద పటిష్ట భద్రత: సీపీ

KNR: గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, మండపాల వద్ద పటిష్ట భద్రత చేపట్టాలని కరీంనగర్‌ సీపీ గౌష్‌ ఆలం సూచించారు. చొప్పదండి, రామడుగుల్లో మండపాలు, నిమజ్జన ప్రాంతాలను అధికారులతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, వాటర్‌ప్రూఫ్‌ షెడ్లు, ఫైర్‌ సేఫ్టీ ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.