హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రారంభమైన గణపతి నిమజ్జనాలు

కాకినాడ జిల్లాలో గురువారం గణేశ నిమజ్జనాలకు శ్రీకారం చుట్టారు. మూడు రోజుల ఉత్సవాలు ముగియడంతో పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. సినిమా రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన 4 అడుగుల గణేశ విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగిస్తూ రూరల్ నిమజ్జన స్థలానికి తరలించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు హాజరై శాంతియుతంగా నిమజ్జనాలు నిర్వహించాలని సూచించారు.