హైదరాబాద్: 28°C
తెలంగాణ

75 మందికి ఉచిత కంటి చూపు పరీక్షలు

SRD: ఖేడ్ పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఇవాళ నిర్వహించిన ఉచిత కంటి చూపు పరీక్షలకు స్పందన లభించింది. మొత్తం 75 మందికి కంటి పరీక్షలు చేయగా, 50 మందికి కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు శంకరప్ప తెలిపారు. అయితే వీరికి హైదరాబాద్ ఓ ఆస్పత్రిలో ఉచిత కంటి ఆపరేషన్‌కు ప్రత్యేక వాహనంలో తరలించి, ఆపరేషన్ అయ్యాక ఖేడ్‌కు క్షేమంగా చేరుస్తామన్నారు.