హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

KMR: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం కానిస్టేబుల్ శిక్షణ తరగతుల స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షకు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణ, నిబద్ధత, నిరంతర పట్టుదల అవసరమని అన్నారు.