హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తారాబు జలపాతం అభివృద్ధి'

ASR: పెదబయలు మండలం తారాబు జలపాతాన్ని అరకు ఎంపీ నిధులు రూ.5కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఎంపీ తనూజారాణి, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ గురువారం జలపాతం పరిశీలించారు. గాజు వంతెన, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్, పార్కింగ్, తాగునీరు, వాచ్‌టవర్, నడక మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.