హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల చెక్ పవర్ పునరుద్ధరించాలని వినతి

NGKL: జిల్లాలో నిలిపివేసిన సర్పంచుల చెక్ పవర్‌ను తక్షణమే పునరుద్ధరించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకుడు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మొలచింతపల్లి, పెంట్లవెల్లి సర్పంచులతో కలిసి ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విచారణలో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగలేదని తేలితే సర్పంచులకు తిరిగి అధికారాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.